- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీ తాగేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు
దిశ, కూకట్పల్లి : టీ తాగేందుకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా మితిమీరిన వేగంతో వచ్చిన బుల్లెట్ బైక్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్‌లోని ఎల్ఐజీ 95లో నివాసం ఉంటున్న కట్ట నర్సింహ మూర్తి(60) స్థానికంగా లేబర్‌గా పని చేస్తుంటాడు.
శనివారం ఉదయం టీ తాగేందుకు రోడ్డు దాటి వెళ్లిన నర్సింహమూర్తి అనంతరం ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా హైటెక్‌సిటీ వైపు నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన బుల్లెట్ బైక్ ఢీకొట్టింది. దీంతో నర్సింహమూర్తి ఎగిరి పడి తలకు బలమైన గాయం అవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, నర్సింహ మూర్తి కొడుకు కట్ట నాగరాజు అందించిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు.