విషాదం నింపిన విహారయాత్ర.. నదిలో పడి నలుగురు బాలికలు మృతి

by Satheesh |   ( Updated:2023-02-15 13:46:32.0  )
విషాదం నింపిన విహారయాత్ర.. నదిలో పడి నలుగురు బాలికలు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదాగా విహారయాత్రకు వెళ్లిన నలుగురు యువతులు కావేరి నదిలో పడి మృతి చెందారు. కరూర్ జిల్లా మయనూర్‌లో బుధవారం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి స్థానికుల సహయంతో బాలికల మృతదేహాలను బటయకు తీసుకువచ్చారు. విహారయాత్రక వెళ్లిన కూతుర్లు శవాలుగా బయటకు రావడంతో బాలికల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికలు నదిలో పడిపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read...

ప్రియుడు చేతిలో హత్యకు గురైన ఢిల్లీ యువతి: చివరి వీడియో ఇదే..!

Advertisement

Next Story