- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దొంగతనం కేసులో నలుగురి అరెస్ట్
రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం
దిశ, కామారెడ్డి రూరల్ : గత నెల 28, 29న కామారెడ్డి పట్టణంలోని కేసీఆర్ కాలనీలో జరిగిన దొంగతనం కేసులో మహమ్మద్ ఫెరోజ్, బొమ్మని అశోక్, సదల భరత్ కుమార్, తెనుగు మహేందర్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు, నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత నెల ఏప్రిల్ 28, 29న కామారెడ్డి పట్టణంలోని కేసీఆర్ కాలనీలోని ఆలకొండ సంతోష్ రెడ్డి ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో సంతోష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామని తెలిపారు. మహమ్మద్ ఫిరోజ్, బొమ్మని రాములమ్మ అశోక్ @ అనిల్, సదల భరత్ కుమార్, తెనుగు మహేందర్ లను విచారించగా తాము చేసిన దొంగతనం ఒప్పుకునట్లు ఎస్పీ తెలిపారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
అదేవిధంగా వారి వద్ద నుండి 6.4 తులాల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను విచారణ చేపట్టగా వారు కామారెడ్డి పట్టణంలో, అనంతరం జంగంపల్లి గ్రామంలో ఓ దొంగతనం చేసి అక్కడి నుంచి మేడ్చల్, హైదరాబాద్ కు వెళ్లినట్లు ఎస్పీ తెలిపారు. కేసు ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించి పోలీసు అధికారులను ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.