గుండెపోటుతో మాజీ ఎంపీపీ మృతి..

by Sumithra |
గుండెపోటుతో మాజీ ఎంపీపీ మృతి..
X

దిశ, మంగపేట : మంగపేట మాజీ ఎంపీపీ, కమలాపురం మాజీ సర్పంచ్ కళ్యాణపు ఆగయ్య (86) ఆదివారం రాత్రి హన్మకొండ జిల్లా కేంద్రంలోని ప్రేటు ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండలంలోని కమలాపురం బిల్ట్ కర్మాగారంలో కార్మికుడిగా పని చేస్తూ వామపక్ష ఉద్యమాలకు మండలంలో దశాబ్ధాల కాలంగా ఊపిరిపోసి కార్మిక తాడిత పీడిత రైతాంగ కూలీల పక్షాన నిలబడి వారి అభ్యుదయానికి కృషి చేశారు. కమలాపురం 2 ఎంపీటీసీగా గెలిచి మంగపేట ఎంపీపీగా పని చేసిన ఆగయ్య అంతక ముందు కమలాపురం సర్పంచ్ గా ఐదు సంవత్సరాల పాటు పని చేసి ప్రజల మన్ననలను చూరగొన్నారు. ఆదివారం రాత్రి గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు హన్మకొండలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స అందిస్తుండగానే మృతి చెందినట్లు తెలిపారు. ఆగయ్యకు భార్య వనమాల, కుమారులు సుమన్, సురేందర్, కూతుర్లు సుజాత, సుమలతలున్నారు.

Advertisement

Next Story

Most Viewed