- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీ బాలాజీ రైస్ మిల్లులో అగ్నిప్రమాదం..
దిశ, వెల్దుర్తి : మండలంలోని హస్తాల్పూర్ గ్రామ శివారులోగల బాలాజీ రైస్ మిల్లులో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. వెల్దుర్తి గ్రామానికి చెందిన కొందరు వ్యాపారస్తులు హస్తాల్పూర్ గ్రామ శివారులో నూతన రైస్ మిల్లును కట్టించారు. ఈ రైస్ మిల్ మే 31 తేదీన ప్రారంభం కావాల్సి ఉండగా మరమ్మత్తులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఓవైపు ధాన్యంను నిల్వలు వేస్తుండగా మరోవైపు గోదాం నిర్మాణం కోసం వెల్డింగ్ పనులు నడుస్తున్నాయి. వెల్డింగ్ నిప్పులు చేల్లరేగి ఒకసారిగా ధాన్యం బస్తాల పై పడడంతో బస్తాలకు నిప్పు అంటుకొని మంటలు లేచాయి.
అప్పటికి అప్రమత్తమైన సిబ్బంది మంటలు ఆర్పీ చేసినప్పటికి, పెద్దఎత్తున ధాన్యం ఉండడంతో నర్సాపూర్ అగ్నిమాప సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. ఓవైపు ధాన్యం నిల్వ చేస్తుండగానే, మరోవైపు వెల్డింగ్ పనులు చేయడమేంటిని రైస్ మిల్లర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పలువురు గ్రామస్తులు మండిపడుతున్నారు. అగ్నిమాక సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పకపోతే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం బుగ్గిపాలు అయ్యేదని పలువురు తెలిపారు. సంఘటన స్థలానికి తహసీల్దార్ నాగవర్ధన్, ఎస్సై మధుసూదన్ గౌడ్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.