- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్ధరాత్రి మంచం కోసం దంపతుల మధ్య గొడవ.. స్నేహితురాలితో కలిసి షాకిచ్చిన భార్య
దిశ, వెబ్ డెస్క్: కొంత మంది దంపతులు ఏదో ఒక కారణంతో నిత్యం గొడవలు పడుతూనే ఉంటారు. ఎక్కువగా చీరల కోసమో, నగల కోసమో కీచులాడుకుంటుంటారు. లేదా భార్య వంట సరిగ్గా చేయలేదని వాగ్వాదాలు జరుగుతాయి. కానీ ముంబైలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దంపతుల జంట అర్ధరాత్రి మంచం కోసం గొడవ పడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ముంబైలో బొరివ్లీ ఏరియాలో లేన్‌కు చెందిన జంట నివాసం ఉంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో భర్త నుంచి విడాకులు కావాలని భార్య కోర్ట్‌కు వెళ్లింది. దానికి భర్త నిరాకరించడంతో ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇంట్లో వస్తువులను పంచుకుని కాపురం చేస్తున్నారు. విడదీయలేని వస్తువులను సమయం కేటాయించుకుని ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి మంచంపై నిద్రిస్తున్న తాను రెస్ట్ తీసుకోవాలని చెప్పి మంచం మీద నుండి లేవమన్నాడు. దానికి భార్య ఇది నా టైమ్ మంచం పైనుండి లేవను అని చెప్పింది. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త ఆమెను గట్టిగా కొట్టాడు. భార్య ఆమె స్నేహితురాలి సహాయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.