మహిళా వైద్యురాలు ఆత్మహత్యాయత్నం..

by Sumithra |
మహిళా వైద్యురాలు ఆత్మహత్యాయత్నం..
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ లైన్ లో ఉన్న బాలాజీ ఈఎన్టి ప్రైవేటు ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మహిళ వైద్యురాలు ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంకు చెందిన డాక్టర్ బీనా గత కొంతకాలంగా పట్టణంలోని బాలాజీ స్కిన్ అండ్ ఈఎన్టీ హాస్పిటల్లో చెవి ముక్కు గొంతు వైద్యురాలిగా పనిచేస్తున్నది.

కాగా సోమవారం ఆమె గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను హైదరాబాద్ తరలించారు. ఈ సంఘటన జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. ఆమె ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు పూర్తిగా తెలియరాలేదు. అయితే వ్యక్తిగత కారణాల వల్లనే ఆత్మహత్యయత్నం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసునమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Advertisement

Next Story