వీడు తండ్రేనా.. ఆ సమయంలో కూతురిపై అత్యాచారం.. విస్తుపోయే విషయాలు చెప్పిన బాలిక

by samatah |   ( Updated:2022-08-10 07:03:27.0  )
వీడు తండ్రేనా.. ఆ సమయంలో కూతురిపై అత్యాచారం.. విస్తుపోయే విషయాలు చెప్పిన బాలిక
X

దిశ, వెబ్‌డెస్క్ : సమాజంలో మహిళలపై దాడులనేవి ఆగడం లేదు. చిన్నా, పెద్ద తేడా మరిచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. ఇక మరికొంత మంది రక్త సంబధాన్ని కూడా వదలడం లేదు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే దారుణానికి ఒడిగడుతున్నాడు. నాన్న అనే వాడు రాక్షసుడిలా మారి పసిపాపల జీవితంలో మాయని మచ్చ తీసుకొస్తున్నారు. తాజాగా తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రే కర్కాటకుడిగా మారి సొంత కూతురిని అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి నుంచి విడిపోయిన బాలికకు అన్నీతానై చూసుకోవాల్సిన తండ్రి ఎనిమిదో తరగతి తన కూతురిపై అత్యాచారం చేశాడు.

వివరాల్లోకి వెళ్లితే.. తమిళనాడులోని వెల్లోర్‌లో ఓ బాలిక ఎనిమిదో తరగతి చదువుతుంది. తన తల్లిదండ్రులు విడిపోవడంతో.. అన్నయ్య, తను తన తండ్రి, తాతయ్య వద్ద ఉంటున్నారు. ఈ క్రమంలో రోజూ తన తండ్రికి అన్నం తీసుకెళ్లి ఇచ్చే క్రమంలో బాలిక తండ్రి ఆమెపై అత్యాచారం చేశేవాడు. అంతటితో ఆగకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానంటూ బెదిరించేవాడు. చివరికి కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది. దీంతో షాకైన కుటుంబ సభ్యులు మైనర్‌ను అడగగా ఆమె అసలు విషయం చెప్పింది. ఇక ఈనెల రెండున బాలిక ఓ పాపకు జన్మనిచ్చింది. దీంతో వైద్యులు శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బాలిక చెప్పిన విషయాలకు షాకైన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టిస్తుంది.

నా భర్త నన్ను అక్కడ కొరికాడు.. కేసు పెట్టిన భార్య

Advertisement

Next Story

Most Viewed