- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడో భార్య చెప్పిందని.. ఏడేళ్ల కుమారుడుని వీడియో తీస్తూ హత్య చేసిన తండ్రి
దిశ, వెబ్‌డెస్క్: తన ఏడేళ్ల కుమారుడిని గొంతు నులిమి హత్య చేసిన కేసులో పరారీలో ఉన్న 26 ఏళ్ల వ్యక్తిని అతని మూడో భార్యతో కలిసి మంగళవారం అరెస్టు చేసినట్లు ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముండే అనే వ్యక్తి మొదటి, రెండో భార్యలు చనిపోవడంతో మూడో భార్యను పెళ్లి చేసుకున్నాడు. కాగా మొదటి భార్యతో అతనిక ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. అలాగే మూడో భార్య పాయల్ మూడు నెలల క్రితం తన తల్లీగారిట్లో మగబిడ్డకు జన్మనిచ్చింది.
దీంతో ఆమెను తీసుకురావడానికి వెళ్లిన ముండేకి మూడో భార్య.. కండిషన్ పెట్టిందని.. మొదటి భార్య కొడుకు ఉంటే తాను ఇంటికి రాను అని చెప్పిందని.. అతన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి వదిలేయ్ లేదా.. చంపేయ్ అని పాయల్ చెప్పింది. దీంతో తాను.. తన ఏడేళ్ల కుమారుడిని గొంతు నులిమి హత్య చేశాడు. హత్యకు సంబంధించిన వీడియోను తన ఫోన్ లో రికార్డ్ చేసి మూడో భార్య అయిన పాయల్‌కు పంపినట్లు తెలిపాడు. కానీ పాయల్, ముండే మధ్య గొడవల కారణంగా ఆమె అతని నెంబర్ బ్లాక్ చేసింది. దీంతో ఆమె ముండే పంపిన వీడియో ని చూడలేక పోయింది. అయితే వీడియో ఆధారంగా ఇద్దరిని అరెస్ట్ చేయగా.. తాను బాలుడుని చంపమని చెప్పలేదని.. తనకేమీ తెలియదని పోలీసులతో చెప్పుకొచ్చింది.