తోమాలపల్లి లో కరెంట్ షాక్ తో రైతు మృతి..

by Sumithra |
తోమాలపల్లి లో కరెంట్ షాక్ తో రైతు మృతి..
X

దిశ, పెబ్బేరు : పెబ్బేరు మండలం తోమాలపల్లి గ్రామంలో గురువారం రాత్రి కరెంట్ షాక్ తో నీలం సుధాకర్ (50) అనే రైతు మృతి చెందాడు. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నీలం సుధాకర్ (50) అనే రైతు తమ శీని తోటకు నీరు పెట్టడానికి వెల్లగా అకస్మాత్తుగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. నల్ల వేన చెరువు సమీపంలోని బలేని శలక పొలంలో కరెంట్ షాక్ తగిలినట్లు గ్రామస్తులు తెలిపారు. సాయంత్రం ఐదుగంటల సమయంలో కరెంట్ షాక్ తో మృతి చెంది ఉంటాడని అయితే రాత్రి 8 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో ఆయన కుమారుడు రామకృష్ణ పొలం వద్దకు వెళ్లి చూడగా కరెంట్ షాక్ తో చనిపోయి పడివున్నట్లు తెలిపారు. విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed