- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంటను రక్షించుకునేందుకు వేసిన కంచె.. విద్యుత్ ఘాతంతో రైతు మృతి..
by Sumithra |
X
దిశ, వెల్దుర్తి : విద్యుత్ ఘాతంతో ఓ రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని యశ్వంతరావు పేట గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన రైతు గుండెని యాదయ్య (51) తనకు ఉన్న 10 గుంటల వ్యవసాయ భూమిలో వరి ధాన్యం పంటను వేశారు. పంటను రక్షించుకునేందుకు ఇనుప తీగలతో కంచె ఏర్పాటు చేసి వాటికి విద్యుత్ సరఫరా అయ్యే విధంగా విద్యుత్ వైర్లను బిగించాడు.
శనివారం తెల్లవారుజామున తన వ్యవసాయ పొలానికి వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఇందిరమ్మ, కుమారులు ప్రవీణ్ లింగంలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు.
Advertisement
Next Story