అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

by Shiva |
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
X

దిశ, మద్దూరు : అప్పుల బాధ తాళలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం మద్దూరు మండల పరిధిలోని బంజారా గ్రామంలో చోటుచేసుకుంది. మద్దూరు ఎస్సై నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మార్మాముల గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం బంజారా గ్రామానికి చెందిన రైతు మీస రాయుడు (40) వ్యవసాయంలో నష్టం రావడంతో ఆర్థిక ఇబ్బందులతో తాగుడుకు బానిసయ్యాడు. శుక్రవారం మద్యం సేవించిన మైకంలో తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు సిద్దిపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మీస రాయుడు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. రాయుడు భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నారాయణ తెలిపారు.

Advertisement

Next Story