- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ముంబై పోలీస్ పేరుతో దోపిడీ..
దిశ, పేట్ బషీరాబాద్ : “హలో.. మీ పేరు పైన పార్సిల్ వచ్చింది.. అందులో అభ్యంతరకరమైన వస్తువులు ఉన్నాయి. మీ కాల్ ను పోలీసులకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము.. మాట్లాడండి..”అంటూ ఫేక్ కాల్స్ చేసి ఇంట్రాగేషన్ పేరుతో భయభ్రాంతులను గురిచేసి అందిన కాడికి దోచేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరిట వస్తున్న ఈ తరహా ఫోన్ కాల్స్ ఉచ్చులో పడి వేలు.. లక్షల రూపాయల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు బాధితులు. అసలు ముంబై పోలీసులంటూ వీడియో కాల్ విచారణ అంటూ ఫోన్ చేస్తున్నారు..? నమ్మించడానికి ఎలా ప్రవర్తిస్తున్నారు..? ఏం చేయాలి..? ఎలా స్పందించాలి ..? అనే అంశం పై కథనం.
తొలుత పార్సిల్ వచ్చిందని..
సైబర్ నేరగాళ్లు ముందుగా మీ పేరిట ఫెడెక్స్ పార్సెల్ వచ్చిందని, అది తైవాన్ లేదా ఇరాన్ నుంచి ముంబైకి పార్సిల్ వచ్చిందని, అందులో కొన్ని సందర్భాలలో డ్రగ్స్ ఉన్నాయని మరికొన్ని సందర్భాలలో అభ్యంతరకరమైన వస్తువులు ఉన్నాయంటూ ఫోన్లు చేస్తారు. అనంతరం ఈ విషయమై ముంబై పోలీసులు కేసునమోదు చేశారంటూ, మీ కాల్ ను వాళ్లకి ఫార్వర్డ్ చేస్తున్నాము అంటూ లైన్ కలుపుతారు.
అచ్చంగా పోలీసులు లాగానే..
పార్సిల్ నేపంతో వచ్చిన ఫోన్ కాల్.. అనంతరం ముంబాయి క్రైమ్ బ్రాంచ్ ఎస్సై కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆయన అచ్చం పోలీసు లాగానే మాట్లాడుతూ మీపై పలుకేసులు నమోదయ్యాయి అంటూ పై అధికారులు మిమ్మల్ని ఇంట్రాగేట్ చేస్తారు. అంటూ సీఐ లేదా ఏసీపీ స్థాయి అధికారి నుంచి స్కైప్ లేదా ఫోన్ వీడియో కాల్ లో మాట్లాడటం జరుగుతుంది. ఇక అధికారి వీడియో కాల్ లోనే పలు రకాలుగా ఇంట్రాగేట్ చేస్తూ అవతలి వ్యక్తులతో అసలైన పోలీస్ అధికారిగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తాడు. ఆఖరికి మీ ఎకౌంటును వెరిఫికేషన్ చేయాలని చెప్పి లింకు ద్వారానో యూపీఐ ద్వారాను డబ్బులను సైబర్ నేరగాళ్ల అకౌంట్స్ లోకి రాబట్టుకుంటున్నారు.
ఇంట్రాగేషన్లో.. అచ్చంగా పోలీస్ స్టేషన్ సెట్..
సైబర్ నేరగాళ్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరిట వీడియో కాల్ లో ఇంట్రాగేషన్ చేసే సమయంలో బాధితులను నమ్మించడానికి పక్కాగా వ్యవహరిస్తున్నారు. వీడియో కాల్ సమయంలో పోలీసులుగా వ్యవహరించే వారు మాట్లాడుతున్నప్పుడు వారి వారి బ్యాగ్రౌండ్స్ లో ఉన్న సీనరీ కూడా అచ్చం పోలీస్ స్టేషన్ లాగానే కనబడే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మధ్య మధ్యలో స్టాప్ వచ్చి సెల్యూట్ లు కొట్టడం, పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్ చేస్తున్న సమయంలో బాధితులు అరవడం వంటివి వీడియో కాల్ లో కనిపించే విధంగా లేదా వినిపించే విధంగా చేస్తూ బాధితులను పక్కాగా నమ్మించే విధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో భాదితులు కాల్ వచ్చింది నిజంగా ముంబై పోలీసుల నుంచే వచ్చిందని నమ్మేస్తున్నారు.
విద్యావంతులే మోసపోతున్నారు..
ఇక ముంబై పోలీస్ తరహా సైబర్ నేరాలలో ఎక్కువగా మోసపోతుంది ఉన్నత విద్యావంతులే. వీరిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే మరి కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. అతికొద్ది సందర్భాలలోనే సామాన్యులు లేదా గృహిణులు ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలు పరిశీలిస్తే ఫారెస్ట్ విభాగంలో సెక్షన్ ఆఫీసర్, చార్టెడ్ అకౌంటెంట్, ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉన్నత స్థాయి ఉద్యోగులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిన వారిలో ఉన్నారు. ముంబై పోలీస్ సైబర్ నేరగాళ్లు అన్ని సందర్భాలలో ఒకేలా వ్యవహరించడం లేదు. ఒక సందర్భంలో పార్సిల్ వచ్చిందని, మరొక సందర్భంలో మీ పిల్లవాడు డ్రగ్స్ కేసులో ఉన్నాడని, మరొక సందర్భంలో విదేశాలలో మీ పిల్లవాడు రేప్ కేసులో ఇరుక్కున్నాడని ఫోన్ చేయడం పరిపాటిగా మారింది.
మచ్చుకు కొన్ని ఘటనలు..
ఈ మధ్యకాలంలో ముంబై పోలీసుల మంటూ ఫోన్ చేసి బాధితుల నుంచి సైబర్ నేరగాళ్లు భారీగానే దోచుకుంటున్నారు. ఈ మధ్యనే నగరంలో ఓ పోలీస్ స్టేషన్లో సీఐగా పనిచేస్తున్న ఓ పోలీసు అధికారికి సైతం ముంబై పోలీసుల పేరిట ఫోన్ చేసి ఫ్రాడ్ చేసే యత్నం చేశారు. ఇటీవల జరిగిన కొన్ని ముంబై పోలీస్ సైబర్ నేరగాళ్ల కేసులను పరిశీలిస్తే..
కళావతి నగర్ కు చెందిన ఓ మహిళలకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీ అమ్మాయి వద్ద డ్రగ్స్ దొరికాయని, ఆమె చదువుతున్న కళాశాల విద్యార్థుల వద్ద కూడా డ్రగ్స్ కేసు ఇన్వాల్వ్ అయ్యారని, డబ్బులు పంపిస్తే వదిలేస్తామని లేకపోతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ అవర్ చేస్తామని బెదిరించి ఆమె వద్ద నుంచి 25 వేల రూపాయలను దోచుకున్నారు.
మీ ఫోన్ బ్లాక్ అవుతుంది ఆధార్ కార్డు ఫ్రాడ్ వినియోగానికి మీరు ఉపయోగించారు, మీరు దోషులు కాకపోతే ముంబై పోలీసులకు ఫోన్ చేయండి అని ఏకంగా ఫారెస్ట్ ఆఫీసర్ కు ఫోన్ చేసి ఆమెతో వీడియో కాల్ లో ఇంటరాగేషన్ చేస్తూ భయభ్రాంతులను గురిచేసి రూ 35000 కొల్లగొట్టారు.
బాచుపల్లికి చెందిన చార్టెడ్ అకౌంట్ కు ముంబై ఐటీ ఇన్స్పెక్టర్ అంటూ ఫోన్ చేసి వీడియో ఇన్వెస్టిగేషన్ కాల్ లో సీఐ, ఎస్సై, డీఎస్పీ స్థాయి అధికారులు అంటూ ఇంట్రాగేషన్ చేస్తూ మీరు మనీలాండరింగ్, చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డారంటూ పలు విధాలుగా వీడియో కాల్ ఇంట్రాగేషన్ చేసి 44 వేల రూపాయలను రాబట్టుకున్నారు సైబర్ నేరగాళ్లు.
జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్ కు చెందిన ఓ సాఫ్ట్వేర్ మహిళకు టెలికాం డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెబుతూ మీ ఫోను ఇల్లీగల్ ఆక్టివిటీస్ కి వాడుతున్నారు, మీ కాలనీ ముంబై పోలీసులకు ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటూ వీడియో కాల్ లో మాట్లాడుతూ దాదాపుగా రెండు గంటలసేపు ఇంటరాగేషన్ చేసిన అనంతరం 50 వేలను ట్రాన్స్ఫర్ చేపించుకున్నారు.
చింతల్ కు చెందిన ఓ మహిళకు మీ అబ్బాయి పై దుబాయ్ పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. కాంప్రమైజ్ కోసం 50 వేలు పంపించాల్సిందిగా డిమాండ్ చేసి రాబట్టుకున్నారు.
సూరారంకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఫేక్ ముంబై పోలీసులు ఫోన్ చేసి మీకు ఇరాన్ నుంచి ముంబైకి ఫెడెక్స్ పార్సిల్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉండడంతో పాటు మీ పేరు మీద ఉన్న క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేశారని, పలు విధాలుగా భయపెట్టి 50 వేల రూపాయలను కొట్టేశారు.
వీడియో కాల్ ఇంటరాగేషన్ అంటే అసలు నమ్మకండి : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సీఐ గడ్డం మల్లేష్
ముంబై పోలీసులు అంటూ ఎవరైనా ఫోన్ చేస్తే ఏమాత్రం స్పందించకండి. పోలీసులు వీడియో కాల్ లో ఇంట్రాగేషన్ చేయడం జరగదు. కాబట్టి ఎవరు కూడా ముంబై పోలీసులు అంటూ ఫోన్ చేసి ఇంట్రాగేషన్ పేరిట వీడియో కాల్ చేస్తే పట్టించుకోకండి. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఏమాత్రం భయపడకుండా స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోండి. అవగాహనతోనే ఇలాంటి సైబర్ నేరాలను కట్టడి చేయగలం.