Drugs Party: మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం.. పట్టుబడిన ప్రముఖ కొరియోగ్రాఫర్

by Shiva |   ( Updated:2024-12-02 03:52:13.0  )
Drugs Party: మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం.. పట్టుబడిన ప్రముఖ కొరియోగ్రాఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని మాదాపూర్‌ (Madhapur)లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. ఓయో (OYO)లో డ్రగ్స్ పార్టీ (Drugs Party) నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ రెయిడ్స్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్హ మహంతి (Kanha Mohanty) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆమెతో పాటు పార్టీ నిర్వహించిన ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డి (Priyanka Reddy) కూడా పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. అయితే, ప్రియాంక రెడ్డి (Priyanka Reddy) ఇచ్చిన పార్టీకి కన్హ మహంతి (Kanha Mohanty) హాజరైనట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీ కోసం బెంగళూరు (Bengaluru) నుంచి డ్రగ్స్ (Drugs) తీసుకొచ్చినట్లుగా సమాచారం. ఈ మేరకు డ్రగ్స్ పార్టీ (Drugs Party)లో పాల్గొన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ఎండీఎంఏ (MDMA)తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్‌‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.





Advertisement

Next Story

Most Viewed