- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
దిశ, మేడ్చల్ టౌన్: ధనార్జనే ధ్యేయంగా యువతనే టార్గెట్ గా చేసుకుని నిషేధిత డ్రగ్స్ అమ్ముతూ జల్సాలు చేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ వెంకట్ రెడ్డి వివరాలు వెల్లడించారు. యువతను టార్గెట్ చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిష్టాపూర్ లో నివాసం ఉండే నిందితుడు పోతిరెడ్డి మోహన్ బాబు ఎస్ఓటీ పోలీసుల దాడిలో పోతిరెడ్డి మెహర్ బాబాను అరెస్ట్ చేయగా ఢిల్లీకి చెందిన మరో నిందితుడు జిన్ని పరారీలో ఉన్నట్టు తెలిపారు.
నిందితుని వద్ద దాదాపు రూ. 4 లక్షల విలువ చేసే డ్రగ్స్, స్కూటీ, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.