లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్లు..

by Sumithra |
లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్లు..
X

దిశ, డోర్నకల్ (కురవి) : రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన మంగళవారం రాత్రి ఇల్లెందు రహదారిపై జరిగింది. కురవి ఎస్సై సతీష్ కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా కొత్తూరు ప్రాంతంలో ఇల్లందు రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొనడంతో క్యాబిన్లో ఇరువురు డ్రైవర్లు ఇరుక్కున్నారు. క్యాబిన్లోనే క్షతగ్రాతులకు ప్రథమ చికిత్స అందిస్తూ దాదాపు నాలుగు గంటల పాటు తీవ్రంగా శ్రమించి అతి కష్టం మీద ఇరువురు క్షతగాత్రులను వెలుపలికి తీసి మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. దీంతో కురవి పోలీసుల సహాయ సహకారాలకు ప్రయాణికులు, ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

Advertisement

Next Story