- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యాపారంలో లాభం రావాలని అందరి ముందు భార్యను ఏం చేశాడో తెలుసా?
దిశ, వెబ్డెస్క్: ప్రస్తుతం టెక్నాలజీ ఎంత పెరిగినా జనాలకు మూఢ నమ్మకాలపై నమ్మకం మాత్రం తగ్గటం లేదు. మూడనమ్మకాల ముసుగులో ఎంతటి దారుణాలకైనా తెగిస్తున్నారు. అదేవిధంగా డబ్బుపై అత్యాశతో అనుబంధాలను మరిచి అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఘటనే మహారాష్టలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్టలోని పూణెకు చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. కుటుంబాన్ని పోషించడం కోసం చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. కొన్నిరోజుల నుంచి వ్యాపారంతో అతను అనుకున్నంత లాభం రావడం లేదు. దాంతో ఏం చేయాలా? అని ఆలోచిస్తున్న సమయంలో క్షుద్ర పూజలు చేయిస్తే ఎక్కువ లాభాలు వస్తాయని, అంతా మంచి జరుగుతుందని ఓ మాత్రికుడు సలహా ఇచ్చాడు. దీంతో అది నమ్మి. క్షుద్ర పూజలు చేయించాడు. అందులో భాగంగా భార్యను అందరి ముందు నగ్నంగా స్నానం చేయించాలని తాంత్రికుడు కోరడంతో దానికి ఆమె నిరాకరించింది. భర్తతో పాటు అత్త, మామలు కూడా చేయాల్సిందే అంటూ తీవ్ర ఒత్తడి తీసుకొచ్చారు. దిక్కుతోచని స్థితిలో ఆమె భర్త కుటుంబం చెప్పినట్టు చేసింది. అది గమనించిన స్థానికులు కూడా ఆ దారుణాన్ని అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ధైర్యం చేసి ఆమెనే వారి బారినుంచి తప్పించుకొని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు. సలహా ఇచ్చిన మాంత్రికుడు పరారీలో ఉన్నట్టు తెలిపారు.