- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జీవితంపై విరక్తి కలిగి వ్యక్తి ఆత్మహత్య

X
దిశ, బిచ్కుంద : జీవితంపై విరక్తి కలిగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బిచ్కుంద మండలం వాజిద్ నగర్ లో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మారెవర్ రాంచందర్ (48) బతుకుదెరువు నిమిత్తం ఇద్దరు పిల్లలతో హైదరాబాద్ కు వలస వెళ్లాడు. అక్కడ సరైన ఉపాధి లభించకపోవడంతో భార్యా, పిల్లలను హైదరాబాద్ లోనే వదిలి స్వగ్రామమైన వాజిద్ నగర్ కు తిరిగొచ్చాడు. పట్నం వెళ్లినా.. సరైన ఉద్యోగం లభించకపోవడంతో రాంచందర్ కు జీవితంపై విరక్తి కలిగి ఇంటి పక్కనే ఉన్న కరివేపాకు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు బిచ్కుంద ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలిపారు. మృతుడి భార్య సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story