- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లేడీ టీచర్ స్కెచ్‌కు అడ్డంగా బుక్కైన డీఈఓ
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ ఇంచార్జ్ డీఈఓ రవీందర్ ఏసీబీకి చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాలలో చర్చనీయాంశం అయ్యింది. ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ ‘దిశ’ కు తెలిపిన వివరాల ప్రకారం.. పదోన్నతుల సందర్భంగా ఒక ఉపాధ్యాయురాలుకు దక్కవలసిన ప్రమోషన్ మరో ఉపాధ్యాయురాలకు దక్కింది. దీంతో ప్రమోషన్ పొందని ఉపాధ్యాయురాలు ఒకే రిజర్వేషన్ ఉండి తనకన్న జూనియర్‌కు ప్రమోషన్ ఎలా వచ్చిందన్న అంశంపై పూర్తి వివరాలను సేకరించి.. ఈ విషయాన్ని డీఈఓ రవీందర్ దృష్టికి తీసుకువెళ్ళింది. తాను ఇప్పుడు ఏమి చేయలేనని కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాలని సూచించారు. ఆమె కోర్టు నుంచి అనుమతిని తెచ్చుకోవడంతో ప్రమోషన్ ఇవ్వడానికి రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. చివరకు లక్షన్నర రూపాయలు తీసుకొని ప్రమోషన్ ఇచ్చారు.
ప్రమోషన్ ఇచ్చిన అనంతరం సీనియారిటీ విషయంలో తనకన్నా జూనియర్ తర్వాతే ఉండడం వల్ల భవిష్యత్తులో తనకు మళ్లీ నష్టం జరిగే ప్రమాదం ఉందని, తన సీనియారిటీని సరి చేయాలని డీఈఓకు తన భర్తతో కలిసి వెళ్లి విజ్ఞప్తి చేసింది. మళ్లీ కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలని డీఈఓ సూచించారు. ఆమె మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో సీనియారిటీ సరిచేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కానీ కోర్టు ఆదేశాలను డీఈఓ అమలు చేయకుండా మరో లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. చివరకు రూ.50 వేలకు అంగీకరించాడు. న్యాయంగా తనకు రావలసిన ప్రమోషన్ రాకుండా, జూనియర్‌కు ఇవ్వడమే కాకుండా, న్యాయస్థానం నుంచి వచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా లంచం డిమాండ్ చేయడంతో ఆ ఉపాధ్యాయురాలు తన భర్తతో కలిసి ఏసీబీని ఆశ్రయించింది. దీనితో తాము రంగంలోకి దిగి లంచం తీసుకుంటున్న డీఈవోను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు.