- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో తీవ్రవిషాదం.
దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలంలో ఘోరం జరిగింది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. జెండా ఆవిష్కరణ అనంతరం సాయంత్రం జెండాను దించేక్రమంలో విద్యుత్ వైర్ తగిలి గ్రామ పంచాయితీ కార్మికురాలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపూర్ గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.
ఎంతో సంతోషంతో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించి కొన్ని గంటలు గడవక ముందే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వీట్లు పంచుకున్నారు. సాయంకాలం గ్రామపంచాయతీ సిబ్బంది రేణుక, చిట్టమ్మ, బిజినపల్లి చిట్టమ్మలు జెండా తొలిగిస్తుండగా జెండా ఇనుప గొట్టం ఒరిగి 11/కేవి వైర్ల మీద పడడంతో ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ తగిలి రేణుక అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు మహిళ సిబ్బందికి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ఆసుపత్రికి తరిలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.