- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: కోరమండల్ ట్రైన్‌కు ఘోర ప్రమాదం.. దాదాపు 30 మంది మృతి?
దిశ, వెబ్‌డెస్క్: హౌరా నుండి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు శుక్రవారం రాత్రి ఒడిషాలో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఏడు బోగీలు బోల్తా పడ్డాయి. దీంతో బోగీల్లోని ప్రయాణికులు చెల్లచెదురుగా పడిపోయారు. కాగా, ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు.
50 అంబులెన్స్‌ల ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. గాయపడిన ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో స్వల్ప గాయాలు అయిన వారిని బస్సుల ద్వారా తరలిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 179 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా.. మరో 30 మంది వరకు మరణించినట్లు సమాచారం. రాత్రి వేళ కావడంతో సహయక చర్యలు కాస్త ఇబ్బందిగా మారగా.. ఘటన స్థలంలో ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. ఇక, ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.