ప్రమాదవశాత్తు మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుడు..

by Sumithra |   ( Updated:2023-04-08 13:16:48.0  )
ప్రమాదవశాత్తు మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుడు..
X

దిశ, చండూరు : ఇంటిమిద్దె కప్పుతుండగా ప్రమాదవశాత్తు జారీ కిందపడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన సంఘటన చండూరు మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నారబత్తుల సైదాచారి (40) అనే భవననిర్మాణ కార్మికుడు రోజువారీ కూలిపనిలో భాగంగా చండూరులో ఇంటి మిద్ద కప్పు కప్పేపనికి వెళ్లాడు. పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు పై నుండి కింద జారిపడి తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో ఇంటి యజమాని సైదాచారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని సైదాచారిని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో వైద్యుల సూచన మేరకు గాంధీ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడని తెలిపారు. మృతుడు సైదాచారికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story