భగీరథమ్మ చెరువులో నిర్మాణ వ్యర్థాలు..

by Aamani |
భగీరథమ్మ చెరువులో నిర్మాణ వ్యర్థాలు..
X

దిశ,శేరిలింగంపల్లి : ఖాజాగూడ భగీరథమ్మ చెరువులో వ్యర్ధాలను పోసి చెరువును పూడుస్తున్న వారిపై ఇరిగేషన్ అధికారులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న హైడ్రా అధికారులు నగరంలోని చెరువులపై నిఘా పెట్టారు. ఈ నెల 26న గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని భగీరథమ్మ చెరువులో నిర్మాణ వ్యర్ధాలను పోసి జేసీబీ సహాయంతో చదును చేస్తున్నట్టు గుర్తించిన హైడ్రా సిబ్బంది ఇరిగేషన్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. భగీరథమ్మ చెరువులో నిర్మాణ వ్యర్ధాలను పోసి చదును చేస్తున్నారన్న ఫిర్యాదుతో సంధ్యా శ్రీధర్ రావు, వెంకటేశ్వర రావు, సుంకర వీర వెంకట సత్యనారాయణ మూర్తి, మణికంఠ అనే వారిపై ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ బి. శ్రీనివాస్ రెడ్డి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు, భగీరథమ్మ చెరువులో నిర్మాణ వ్యర్ధాలను పోసి చదును చేసిన వ్యవహారం వెనుక ఎవరున్నారు. ఎన్నిరోజుల నుంచి చెరువులో నిర్మాణ వ్యర్ధాలను డంప్ చేస్తున్నారనే విషయం విచారణ చేపట్టారు.

సంధ్యా శ్రీధర్ రావుపై మరో కేసు..

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావుపై మరో కేసు నమోదు అయింది. తమ స్థలంలోని ఇళ్లను తన అనుచరులతో కూల్చివేయించాడని బాధితులు గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భగీరథమ్మ చెరువులో నిర్మాణ వ్యర్ధాలను పోసిన ఘటనలోనూ సంధ్యా శ్రీధర్ రావుపై రాయదుర్గం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది.

Advertisement

Next Story

Most Viewed