AP News:కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో తీవ్ర విషాదం

by Jakkula Mamatha |
AP News:కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో తీవ్ర విషాదం
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టేజ్-2 PMT/PET పరీక్షల (దేహదారుఢ్య పరీక్షలు) డిసెంబర్‌ 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టు(Constable Physical Tests)లకు సంబంధించిన ఈవెంట్స్ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా(Krishna District)లో నిర్వహించిన పోలీస్ ఫిజికల్ టెస్టులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మచిలీపట్నంలో నిర్వహించిన పరుగు పందెంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరుకు చెందిన దారావత్తు చంద్రశేఖర్(25) 1600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Advertisement

Next Story

Most Viewed