ప్రమాదానికి గురైన కలెక్టర్ ఉదయ్ కుమార్ కారు

by Shiva |
ప్రమాదానికి గురైన కలెక్టర్ ఉదయ్ కుమార్ కారు
X

తొమ్మిది మందికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

దిశ, తూప్రాన్: మునిసిపాలిటీ పరిధిలోని కరీంగుడా చౌరస్తా వద్ద నిజామాబాద్ నుంచి హైరాబాద్ వైపు వెళ్తున్న నాగర్ కర్నూల్ కలెక్టర్ ఉదయ్ కుమార్ ఇన్నోవా కారు ఆటోను ఢీకొనడంతో తొమ్మిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, క్షతగాత్రులను తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారు తూప్రాన్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో కలెక్టర్ ఉదయ్ కుమార్ తల్లితండ్రులు గంగాధర్, గంగామణి కారులోనే ఉన్నారు. ప్రథమ చికిత్స అనంతరం వారు ప్రైవేటు వాహనంలో నాగర్ కర్నూల్ కు వెళ్లిపోయారని తెలుస్తుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed