రూ. 500 కోసం కూలీని హత్య చేసిన గుత్తేదారు..

by Sumithra |
రూ. 500 కోసం కూలీని హత్య చేసిన గుత్తేదారు..
X

దిశ, శంషాబాద్ : చేసిన కూలి డబ్బుల కోసం దినసరి కూలి గుత్తేదారు మధ్య జరిగిన ఘర్షణలో దినసరి కూలి మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దినసరి కూలి సాయి, గుత్తేదార్ శ్రీనివాస్ ఇద్దరు మద్యం సేవించారు. మద్యం సేవించిన అనంతరం ఇద్దరి మధ్య గొడవ చెలరేగడంతో తాను చేసిన కూలీ డబ్బులు 500 తనకు ఇవ్వాలని దినసరి గుత్తేదారు శ్రీనివాసును కోరాడు.

మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్ పక్కనే ఉన్న డ్రైనేజీ మూత తీసుకొని సాయి తల పై కొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అది గమనించిన స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో దినసరి కూలి సాయి (35) మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి గుత్తేదారు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed