కప్పను చంపి సాంబార్ చేసిన వ్యక్తి.. అది తిని చిన్నారి మృతి

by Mahesh |   ( Updated:2023-02-14 05:04:46.0  )
కప్పను చంపి సాంబార్ చేసిన వ్యక్తి.. అది తిని చిన్నారి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కప్పతో చేసిన సాంబార్ తిని ఓ చిన్నారి మృతి చెందింది. ఈ విషాద సంఘటన ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కప్పను చంపి దానితో సాంబార్ చేశారు. దాన్ని కుటుంబ సభ్యులతో సహా.. ఇద్దరు పిల్లలకు కూడా అన్నంలో కలిపి వడ్డించాడు. దీంతో అది తిన్న వారంతా వాంతులు చేసుకుని స్పృహతప్పి పడిపోగా.. వారందరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ క్రమంలో ఆరేళ్ల చిన్నారి సుమిత్ర చికిత్స పొందుతూ.. మృతి చెందింది. అలాగే.. మరో చిన్నారి మున్నీ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి : వాటర్ ప్యాకెట్లు కొనలేదని వ్యక్తిపై దాడి

Advertisement

Next Story