వినాయక చవితిని క్యాష్ చేసుకున్న దొంగలు

by Nagaya |
వినాయక చవితిని క్యాష్ చేసుకున్న దొంగలు
X

దిశ, అల్వాల్ : వినాయక చవితిని క్యాష్ చేసుకున్నారు దొంగలు. అల్వాల్ సర్కిల్ పరిధిలో గణపతి పూజా సామాగ్రి కొనుగోలులో జనాలు నిమగ్నం కావడంతో తమ పని తాము కానిచ్చేశారు. అనుమానం రాకుండా 5 నుంచి పదేళ్ల పిల్లలను చోరీ కోసం ప్రయోగించి.. విలువైన స్మార్ట్ ఫోన్లను దొంగతనం చేశారు. అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే ఐదు సెల్ ఫోన్ చోరీ కేసులు నమోదు కాగా.. మోడ్రన్ టెక్నాలజీని ఉపయోగించి తమ ఫోన్లు తమకు దొరికేలా చూడాలని బాధితులు కోరారు. ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఒక్క రోజే 25 వరకు సెల్ ఫోన్ దొంతనాలు జరిగాయని తెలుస్తోంది.

Advertisement

Next Story