- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్ఎంపీ వైద్యుని ఇంటిపై సీసీఎస్ పోలీసుల మెరుపు దాడి.. అలా చేస్తున్నాడనే..
దిశ, కామారెడ్డి : ధనార్జనే ధ్యేయంగా తప్పును కూడా దర్జాగా చేస్తున్నారు కొందరు వైద్యులు. బేబీ టెస్టింగ్ తప్పని తెలిసినా డబ్బుల కోసం పిండాన్ని కడుపులోనే చిదిమేస్తున్నారు దుర్మార్గులు. గత కొద్దిరోజులుగా జిల్లా కేంద్రం అడ్డాగా సాగుతున్న లింగ నిర్దారణ పరీక్షల అంశం బయటకు వస్తున్నా వైద్యశాఖ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా రాజంపేట మండల కేంద్రంలో లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఆర్ఎంపీ వైద్యుడు బల్ల రవి ఇంటిపై సీసీఎస్ పోలీసులు దాడులు చేశారు. లింగ నిర్దారణ చేస్తున్న వైద్యుడు రవిని సీసీఎస్ పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే స్కానింగ్ మిషన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొద్దిరోజులుగా ఆర్ఎంపీ వైద్యుడు లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో సీసీఎస్ పోలీసులు పక్కా సమాచారంతో రవి ఇంటిపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది.