గాలిలో పల్టీ కొట్టిన కారు.. మహిళ మృతి

by Aamani |
గాలిలో పల్టీ కొట్టిన కారు.. మహిళ మృతి
X

దిశ, నాగర్ కర్నూల్ : గాల్లో కారు పల్టీ కొట్టి ఓ మహిళ మృతి చెందిన ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకోగా గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం ...నాగర్ కర్నూల్ మండలం పెద్ద ముద్దునూరు వద్ద అతి వేగంగా దూసుకొచ్చిన కారు గాలిలో పల్టీలు కొడుతూ బీభత్సం సృష్టించి ఒకరిని బలితీసుకుంది.నూతన సంవత్సర వేల కారు సృష్టించిన బీభత్సానికి లక్ష్మమ్మ (40)అనే మహిళ మృతిచెందగా డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు.

నాగర్ కర్నూల్ నుంచి కొల్లాపూర్ వైపు బుధవారం వెళుతున్న అతి వేగంగా వెళుతున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పింది. అతివేగంగా ఉండడంతో కారు రోడ్డుపై నుంచి పల్టీలు కొడుతూ పక్కనే నడుచుకుంటూ వెళుతున్న భోగరాజు లక్ష్మమ్మ అనే మహిళ పైనుండి వెళ్ళింది. ఈ సంఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడ్డ కారు డ్రైవర్ ను అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం నాగర్ కర్నూల్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రమాద సంఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed