తాళం వేసిన ఇంట్లో చోరీ...

by Kalyani |
తాళం వేసిన ఇంట్లో చోరీ...
X

దిశ, జడ్చర్ల: శుక్రవారం రాత్రి తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి శనివారం ఉదయం ఇంటికి వచ్చేసరికి ఇంటికి వేసిన తాళం విరగ్గొట్టి తొమ్మిది తులాల బంగారం అపహరించిన ఘటన శనివారం జడ్చర్లలో వెలుగు చూసింది. బాధితుడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల మండలంలోని పోలేపల్లి స్టేజిలో సబ్ స్టేషన్ లో జూనియర్ లైన్ మెన్ గా పనిచేస్తున్న రవికుమార్ గౌడ్ శుక్రవారం రాత్రి భూరెడ్డి పల్లిలోని తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లాడు. ఉదయం డ్యూటీకి వెళ్లడానికి తిరిగి ఇంపీరియల్ గార్డెన్ పరిసరాల్లో ఉన్న తన ఇంటికి వచ్చేసరికి ఇంటి ప్రహరీ దూకి ఇంటికి వేసిన తాళం విరగొట్టి ఉండడాన్ని గమనించిన రవికుమార్ గౌడ్ అనుమానంగా ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో ఉన్న బీరువా తెరిచి వస్తువుల చిందరవందరగా పడి ఉన్నాయని దాంతోపాటు బంగారు నగలు ఉన్న కాలి డబ్బా కనిపించడంతో బాధితుడు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించి జిల్లా క్లూస్ టీం అధికారులను రప్పించి. ఆధారాల కొరకు అన్వేషించారు. ఈ మధ్యలో తమ బంధువులు శుభకార్యాలు ఉండడంతో బ్యాంకులో ఉన్న బంగారాన్ని తీసుకువచ్చామని శుభకార్యాలు అన్ని అయిపోయాయి రెండు రోజుల్లో మళ్లీ బ్యాంకులో పెడదాం అనుకున్నామని రాత్రి శుభకార్యానికి వెళ్లి వచ్చేసరికి దుండగులు 9 తులాల బంగారాన్ని అపహరించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed