Murder : బాల నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి దారుణ హత్య..

by Sumithra |
Murder : బాల నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి దారుణ హత్య..
X

దిశ, కూకట్ పల్లి : బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ నరసింహ రాజు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ కు చెందిన రాజ్ కుమార్ (21) గత కొంత కాలంగా బాలానగర్ పోలీస్ స్టేషన్ ( Bala Nagar Police Station ) పరిధిలోనీ పంచశీల కాలనీలో నివాసముంటున్నాడు. స్థానికంగా ఉన్న లేత్ మిషిన్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

ఇదిలా ఉండగా పంచశీల కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో రాజ్ కుమార్ మృతదేహం రక్తపు మడుగులో లభ్యం అయింది. మెడ భాగంలో, కడుపులో కత్తిలాంటి పదునైన ఆయుధంతో దాడి ( Attacked ) చేసినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని సీఐ నరసింహ రాజు ( CI Narasimha Raju ) తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మృత దేహాన్ని, శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed