- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీబీనగర్లో మహిళా దారుణ హత్య.. అక్రమ సంబంధమే కారణమా..?
దిశ, జడ్చర్ల / రాజపూర్: రాజాపూర్ మండలం బిబి నగర్ గ్రామపంచాయతీలో మహిళను బండరాయితో కొట్ట దారుణంగా హతమార్చిన ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. బాలనగర్ మండలం పెద్దరేవెల్లి గ్రామానికి చెందిన మంజులను గుర్తుతెలియని వ్యక్తులు రాజాపూర్ మండలం బీబీనగర్ గ్రామపంచాయతీలోని ఓ వెంచర్ లో తలపై బండరాయితో బాది దారుణంగా హత్య చేశారు. అటుగా వెళుతున్న గ్రామస్తులు మహిళా మృతదేహాన్ని చూసి రాజాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి జడ్చర్ల రూరల్ సీఐ జమ్ములప్ప, రాజాపూర్ ఎస్సై వెంకట్ రెడ్డి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా మృతురాలు మంజులతో పెదరవెల్లి గ్రామానికి చెందిన వ్యక్తి శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గొడవ పడుతుండగా.. బీబీనగర్ గ్రామస్తులు చూసినట్లుగా పోలీసులకు తెలిపారు. కాగా మంజుల హత్యకు అక్రమ సంబంధం కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
పెద్ద రేవల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై పలువురు అనుమానాలు వ్యక్తపరుస్తూ పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేపడితే గాని మంజుల హత్యకు గల కారణాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. కాగా మృతురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపడుతున్నట్లు రాజాపూర్ ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.