మహిళ నగ్న శరీరంపై బాడీ పెయింట్.. హై కోర్టు సంచలన తీర్పు

by Sathputhe Rajesh |
మహిళ నగ్న శరీరంపై బాడీ పెయింట్.. హై కోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళ నగ్న శరీరంపై బాడీ పెయింట్ వేయించుకున్న కేసులో కేరళ హై కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమాపై నమోదైన పోక్సో కేసును కేరళ హై కోర్టు కొట్టేసింది. మహిళల నగ్న శరీరంపై బొమ్మలు వేయడం అన్ని సందర్భాల్లో అశ్లీలంగా, లైంగికంగా భావించరాదని కోర్టు వెల్లడించింది. ఆడ, మగ శరీరాలను, నగ్నత్వాన్ని వేర్వేరుగా చూడటం సరికాదని తెలిపింది. మహిళల నగ్న శరీరాన్ని లైంగిక వస్తువుగా చూడటం సరికాదంది. రెహానా ఫాతిమాకు ఇద్దరు పిల్లలు కొడుకు, కూతురు ఉన్నారు.

రెహానా ఫాతిమా తన కొడుకు 12 ఏళ్లలోపు, 14 ఏళ్ల కుమార్తతో బాడీ పెయింట్ వేయించుకుంది. ఆమె కొడుకు, కూమార్తె టాప్ లెస్ శరీరంపై పెయింట్ వేస్తున్న దృశ్యాలను వీడియోగా చిత్రీకరించిన రెహానా ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కేరళలో పెను దూమారం రేపింది. దీన్ని చూసిన ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ అరుణ్ ప్రకాష్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో, ఐటీ యాక్ట్, జువైనల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అయితే వాటన్నింటిని హైకోర్టు కొట్టి వేసింది. అయితే రెహానా ఫాతిమా శబరిమలలోకి మహిళలను అనుమతించాలంటూ జరిగిన ఉద్యమంలో పాల్గొనడంతో పలు కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story