బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు..

by Kalyani |
బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు..
X

దిశ, జడ్చర్ల: బైక్ అదుపుతప్పి కింద పడడంతో వ్యక్తి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం రాత్రి జడ్చర్లలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల మండల పరిధిలోని గంగాపూర్ శివారులో స్నేహ దాన కంపెనీ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి కింద పడడంతో మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన నరేష్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డాడు.

తలకు తీవ్రమైన గాయాలు కావడంతో స్పృహ కోల్పోగా పరిస్థితి విషమంగా మారింది. ఈ విషయాన్ని గమనించిన బాటసారులు 108 సహాయంతో నరేష్ గౌడ్ ను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన విషయాన్ని మిడ్జిల్ లో ఉన్న నరేష్ గౌడ్ కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు.

Advertisement

Next Story