- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బార్బర్ హెయిర్ కటింగ్ స్టైలిష్‌గా చేయలేదని..బాలుడి సుసైడ్..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో యువత నలుగురిని ఆకట్టుకోడానికి ప్రతి పనిలోనూ వెరైటీగా ఉండేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, ఆక్సాసిరీస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. అందులో బాయ్స్ మరీ జాగ్రత్త వహిస్తారు. ట్రెండ్‌కు తగ్గట్టుగా హెయిర్ కట్ చేయించుకుంటారు. ఒకవేళ హెయిర్ స్టైల్ విషయంలో ఏమైనా తేడా వస్తే మాత్రం.. తీవ్ర మనస్తాపానికి గురై ఏమైనా చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.
ఇలాంటి సంఘటనే మహారాష్ట్రలోని థానే జిల్లా భయాందర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 13 ఏళ్ల ఓ బాలుడికి విపరీతంగా వెంట్రుకలు పెరిగాయని తమ తల్లిదండ్రులు హెయిర్ సెలూన్‌కు తీసుకెళ్లారు. అయితే బార్బర్ ఆ బాలుడు చెప్పినట్లు స్టైలిష్‌గా చేయకుండా...జుట్టు చిన్నగా కత్తిరించడంతో అతనికి అస్సలు నచ్చలేదు. ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పదే పదే అద్దంలో చూసుకుంటూ బాధపడుతూ ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా గదిలో ఉండిపోయాడు. ‘‘జుట్లు పెరిగాక నీ ఇష్టం వచ్చినట్లు చేయించుకోమని తల్లిదండ్రులు ఎంత నచ్చచేప్పినా వినిపించుకోలేదు. తీవ్ర మనస్తాపానికి గురైనా ఆ బాలుడు బాత్రూంలోకి వెళ్లి డోర్ వేసుకొని.. అదే రూమ్‌లోని కిటికీ నుంచి 16వ అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్ర గాయాలవ్వండంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నవగర్ పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. మృత దేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.