భారత్‌లో బంగ్లా పోర్న్ స్టార్.. వల వేసి పట్టుకున్న పోలీసులు

by karthikeya |
భారత్‌లో బంగ్లా పోర్న్ స్టార్.. వల వేసి పట్టుకున్న పోలీసులు
X

దిశ,వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌ (Bangladesh)కు చెందిన ఓ పోర్న్ స్టార్‌ని భారత పోలీసులు అరెస్ట్ చేశారు. పక్క దేశం నుంచి మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించి నకిలీ పత్రాలతో నివశిస్తున్నారనే సమాచారం అందడంతో ముంబై పోలీసులు (Mumbai Police) చాకచక్యంగా వలవేసి మరీ సదరు యువతిని, ఆమె కుటుంబంతో సహా అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో హిల్‌లైన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్ పోర్న్ సినిమా స్టార్ రియా బర్దే అలియాస్ ఆరోహి బర్దేను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. అయితే రియా తల్లి భారత్‌ (India)లో ఉండడం కోసం అమరావతి (మహారాష్ట్ర)కి చెందిన వ్యక్తిని వివాహం (Marriage) చేసుకుని.. కుమార్తె రియాతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడే మకాం పెట్టిందట. అలాగే దీనికోసం కుటుంబం మొత్తం నకిలీ పత్రాలను వినియోగించారట. ఈ విషయం తెలిసిన వెంటనే.. రియా కుటుంబం, అంజలి బర్దే అలియాస్ రూబీ షేక్, తండ్రి అరవింద్ బర్డే, సోదరుడు రవీంద్ర అలియాస్ రియాజ్ షేక్, ఆమె సోదరి రీతు అలియాస్ మోని షేక్‌లపై ఐపీసీ సెక్షన్‌ 420, 465, 468, 479, 34, 14ఏ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అందరినీ అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించిన దర్యాప్తు అధికారి పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (Police Sub-Inspector) సంగ్రామ్‌ మల్కర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రియా తల్లి అంజలి బంగ్లాదేశ్‌ నివాసి., ఆమెకు రియాతో పాటు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భారత్‌లో నివశించడం కోసం తనని తాను పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా తప్పుడు జనన ధృవీకరణ పత్రాలను సృష్టించి వాటి ద్వారా ఇండియన్ పాస్‌పోర్ట్‌ (Indian Passport)ను పొందింది. ఆ తర్వాత అరవింద్ బర్డే అనే మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుని.. తన కుమార్తెలతో సహా భారత్‌కు మకాం మార్చింది. సమాచారం అందడంతో మొత్తం కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నాం’’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed