పోచమ్మ ఆలయంలో చోరీకి యత్నించిన దుండగుడు..

by Sumithra |   ( Updated:2024-10-19 07:39:59.0  )
పోచమ్మ ఆలయంలో చోరీకి యత్నించిన దుండగుడు..
X

దిశ, మీర్ పేట్ : పోచమ్మ తల్లి దేవాలయంలో అర్ధరాత్రి చోరీకి యత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్ పేట్ లెనిన్ నగర్ రైతు బజార్ వద్ద నివాసముండే జె.కుమార్ (25) వృత్తి రీత్యా బోర్ వెల్ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అర్ధరాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేట్ గ్రామంలో ఉన్న పోచమ్మ తల్లి దేవాలయంలోకి గుర్తు తెలియని దుండగుడు గుడిలోకి చొరబడ్డాడు.

అనంతరం దేవాలయంలో హుండీ చోరీకీ యత్నిస్తుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారని అన్నారు. వెంటనే ఘటనా స్థలానికి పెట్రోలింగ్ వాహనం చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించామని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. నిందితుడు దేవాలయంలో హుండీ తెరిచేందుకు ప్రయత్నించాడని అది ఓపెన్ కాలేదని, దేవాలయంలో ఉన్న ఎలాంటి వస్తువులు ధ్వంసం కాలేదని, నిందితుడి పై గతంలో ఇనుము దొంగతనం కేసులు ఉన్నాయని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.

Advertisement

Next Story