అతిక్ మర్డర్ రీక్రియేట్.. క్రైం స్పాట్‌కు నిందితులు

by Vinod kumar |
అతిక్ మర్డర్ రీక్రియేట్.. క్రైం స్పాట్‌కు నిందితులు
X

ప్రయాగ్‌రాజ్: ఆ రోజు యూపీ గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ధరించిన మాదిరిగానే తలకు తెల్లటి కండువాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు గురువారం తూటాలకు బలయ్యారు. ఇదంతా అతిక్ అహ్మద్, అతని సోదరుడి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) నిర్వహించిన సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగం. ఇందులో ఇద్దరు వ్యక్తులు అతిక్ అహ్మద్, అతని సోదరుడిలా నటించారు. అతిక్, ఆయన సోదరుడు ఎక్కడైతే చనిపోయారో అదే స్థలానికి వారిని చంపిన ముగ్గురు నిందితులను తీసుకెళ్లారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపి అతిక్, ఆయన సోదరుడిని మెడికల్ చెకప్ నిమిత్తం ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా వారిని ముగ్గురు వ్యక్తులు అతి దగ్గరగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

క్రైమ్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో ఇద్దరు వ్యక్తులు రిపోర్టర్లతో పాటు మెల్లగా నడుస్తున్నారు. పోలీసులు కూడా వారితో పాటు నడుస్తున్నారు. ఒక వ్యక్తి సడన్‌గా గన్ తీసి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో అతిక్ మర్డర్ రీక్రియేట్.. క్రైం స్పాట్‌కు నిందితులుఅతిక్ అహ్మద్ తలపై కాల్చాడు. మరో ఇద్దరు ఆయన తమ్ముడిపై పలుసార్లు కాల్పులు జరిపారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. వెంటనే పోలీసులు స్పందించి హంతకులను పట్టుకుని అరెస్ట్ చేశారు. దీనిపై దర్యాప్తు చేయడానికి, క్రైమ్ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం యూపీ ప్రభుత్వం జుడీషియల్ కమిటీని ఏర్పాటు చేసింది.

Advertisement

Next Story

Most Viewed