- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ క్షణంలో తండ్రికి పేగుబంధం గుర్తుకు రాలేదు...
దిశ, ఖమ్మం సిటీ : తాగి విసికిస్తుండటంతో ఆ తండ్రికి పేగుబంధం గుర్తుకు రాలేదు. ఈ దారుణం ఖమ్మం నగరం రామన్నపేట కాలనీలో చోటు చేసుకుంది. తాగుడుకు బానిసైన కొడుకు పెడుతున్న ఇబ్బందులు తాళలేక ఓ తండ్రి దారుణంగా హతమార్చాడు. అర్బన్ ఇన్స్పెక్టర్ భాను ప్రకాష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మంలోని రామన్నపేట కాలనీకి చెందిన కొంపెల్లి వెంకటేశ్వర్లు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు.
ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన చిన్న కుమారుడు కొంపెల్లి గణేష్ (30) కారు డ్రైవర్. ఇతనికి ఐదు సంవత్సరాల క్రితం వివాహం కాగా భార్యతో విడాకులై ఒంటరిగా ఉంటున్నాడు. దాంతో మద్యానికి బానిసై నిత్యం తల్లిదండ్రులను బాధపెడుతున్నాడు. దాంతో మంగళవారం కూడా గొడవ పడటంతో తండ్రి పదునైన ఆయుధంతో తలపై కొట్టి హతమార్చాడు. ఈ మేరకు మృతుడి సోదరుడు కొంపెల్లి నాగేంద్రబాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
- Tags
- murder