శనిగ కుంట పేల్చివేత నిందితులకు సహకరించిన ఇద్దరి అరెస్ట్..

by Aamani |
శనిగ కుంట పేల్చివేత నిందితులకు సహకరించిన ఇద్దరి అరెస్ట్..
X

దిశ, చెన్నూరు : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని శనగకుంట వద్ద గల మత్తడిని జిలెటిన్ స్టిక్స్ తో పేల్చారు. ఆ నిందితులకు సహకరించిన కేసులో పరారీలో ఉన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ భర్త రామ్ లాల్ ను అరెస్ట్ చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. జైపూర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల 16వ తేదీన పట్టణంలోని శనిగ గుంట మత్తడిని జిలేటిన్ స్టిక్స్ తో పేల్చివేసిన నిందిస్తులను అరెస్టు చేసి విచారించారు. పట్టణంలోని పదిమంది భూమాఫియా గాళ్లు శనిగకుంట చెరువులోని ఎఫ్టీఎల్ పరిధిలో గల భూమిలో అక్రమంగా మట్టి పోసి వెంచర్లు చేశారు.

ఈ క్రమంలో మత్తడి ఎత్తు ఎక్కువగా ఉండటంతో తమ వెంచర్ల లోని ప్లాట్లు నీటితో మునిగిపోతుందని ఉద్దేశంతో అదే వార్డుకు చెందిన పెండ్యాల లక్ష్మణ్ , మధు, శ్రీనివాస్ లకు డబ్బులు ఆశ చూపి మత్తడిని కూల్చివేసే ఒప్పందం కుదుర్చుకున్నారు. మత్తడిని జిలెటిన్ స్టిక్స్ తో పేల్చి వేయగా అది గమనించిన ఆయకట్టు రైతులు ఇరిగేషన్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, ఇరిగేషన్ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేశారు. అందులో భాగంగానే నలుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని వారికి సహకరించిన వివిధ పార్టీలకు చెందిన ఏడుగురిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ భర్త రామ్ లాల్ ను శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు . ఈ సమావేశంలో పట్టణ సీఐ రవీందర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed