- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టాప్.. 45 శాతం వాటా
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రవాణాశాఖ అర్థవార్షిక ఆదాయంలో ఉమ్మడి రంగారెడ్డి జల్లాదే 45 శాతం వాటా ఉందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ చంద్ర శేఖర్ గౌడ్ స్పష్టం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రభుత్వానికి రూ.1436 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల అధికారులతో డీసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. రంగారెడ్ది జిల్లాలో రూ.802 కోట్లు, మేడ్చల్-మల్కాజిగిరిలో రూ.595 కోట్లు, వికారాబాద్ జిల్లాలో రూ.39 కోట్లు వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అర్థవార్షిక ఆదాయ లక్ష్యం 1792 కోట్లు పెట్టగా, రూ.1436 కోట్లు సాధించామని, 80% ఆదాయ లక్ష్యాన్ని చేరుకున్నట్లు వివరించారు.
రాష్ట్రానికి వచ్చిన రూ.3195 కోట్ల ఆదాయంలో 45% ఉమ్మడి రంగారెడ్డి జిల్లాదేనని తెలిపారు. త్రైమాసిక పన్నుల ద్వారా రూ.161 కోట్లు, జీవిత కాలపు పన్నుల ద్వారా రూ.1120 కోట్లు, ఫీజుల ద్వారా రూ.92 కోట్లు, సర్వీస్ ఛార్జీల ద్వారా రూ.21 కోట్లు, గ్రీన్ టాక్స్‌ల ద్వారా రూ.10 కోట్లు, తనిఖీల ద్వారా రూ.32 కోట్లు మొత్తం రూ.1436 కోట్ల ఆదాయాన్ని సాధించినట్లు వివరించారు. త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనదారులు పన్నులు చెల్లించాలని లేని పక్షంలో తనిఖీలలో పట్టుబడితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఓవర్ లోడ్‌తో తిరిగే వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. 2024-25లో ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మూడు జిల్లాల రవాణా శాఖ అధికారులు సుభాష్ చందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కిరణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, సుశీల్ రెడ్డి, నవీన్, వాసు, కృష్ణవేణి, మున్ని, అనూష, ఉపాసిని తదితరులు పాల్గొన్నారు.