చేవెళ్లలో పేకాట రాయుళ్ల అరెస్ట్..

by Kalyani |   ( Updated:2023-05-28 15:41:16.0  )
చేవెళ్లలో పేకాట రాయుళ్ల అరెస్ట్..
X

దిశ, చేవెళ్ల: చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ రోడ్డులో ఓ వెంచర్ వాచ్ మెన్ రూంలో చేవెళ్ల, హైదారాబాద్ కు చెందిన కొంతమంది పేకాట ఆడుతుండగా రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు, చేవెళ్ల పోలీసులు రైడ్ చేసి 14మందిని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. చేవెళ్ల గ్రామానికి చెందిన మల్లేశ్, అనంతరాములు, శ్రీనివాస్, నత్తి కృష్ణరెడ్డి, రామచంద్రయ్య, దుర్గ ప్రసాద్, నరసింహ, ప్రశాంత్ రెడ్డి, జయసింహా రెడ్డి మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన రవీందర్, వెంకట్ , మండలంలోని గొల్లగూడ చెందిన నరసింహ, నగరంలోని బండ్ల గూడ, కిషన్ బాగ్ లకు చెందిన శివరాజ్, అబ్దుల్ ముజిబ్ లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 1, 38,650 ల నగదు, నాలుగు కార్లు, ఆరు మోటార్ సైకిళ్లు, 13మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు చేవెళ్ల సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement

Next Story