- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వగ్రామానికి వెళ్లి వస్తానని అనంతలోకానికి...
దిశ, కీసర : స్వగ్రామానికి వెళ్లి వస్తానని చెప్పి స్కూటీపై వెళ్లిన వ్యక్తిని టిప్పర్ రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధి హెచ్పీ పెట్రోల్ పంప్ సమీపంలో చోటు చేసుకుంది. కీసర ఎస్హెచ్ఓ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం... కుషాయిగూడ ప్రాంతంలో నల్ల పెంటయ్య భార్య, ముగ్గురు కుమార్తెలతో కలిసి నివాసముంటున్నాడు. ఒక కుమార్తె వివాహం కాగా, మరో ఇద్దరు చదువుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో స్వీపర్గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు.
స్వగ్రామం సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం వరదరాజ్ పురం గ్రామానికి పెంటయ్య పని నిమిత్తం బయలుదేరాడు. కీసర సమీపానికి చేరుకోగా వెనుకనుంచి అతివేగంతో దూసుకొచ్చిన టిప్పర్ పెంటయ్య(50) ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొనగా తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ దవాఖానాకు తరలించారు. టిప్పర్ డ్రైవర్ రాజుపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారని బంధువులు విచారం వ్యక్తం చేశారు. పెంటయ్య కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు.