రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి..

by Sumithra |
రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి..
X

దిశ, కామారెడ్డి : నడుస్తున్న రైలులో నుంచి జారిపడిన ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే కామారెడ్డి మండలం నరసన్నపల్లి గ్రామ శివారులో శనివారం ఉదయం ఓ రైల్లో ప్రయాణం చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించి తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రుడిని కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story