రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి..

by Vinod kumar |
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి..
X

దిశ, నెక్కొండ: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన నెక్కొండ ఎంపీడీఓ ఆఫీస్ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం 60 సంవత్సరాలకు పైగా ఉన్న వ్యక్తి రైలు కిందపడి మరణించాడు. మృతుడి తల, మొండెం వేరై మృతి చెందాడు. మృతుడి ఎత్తు 5"6 చామన ఛాయా, గోధుమ రంగు ఫుల్ షర్ట్, తెలుపు రంగు ధోతి ధరించాడు. చనిపోయిన వ్యక్తి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు లేని కారణంగా ఆధారాలు లభించలేదన్నారు. మృతదేహాన్నీ ఎంజీఎం హాస్పిటల్ మార్చురీకి తరలించామన్నారు. చనిపోయిన వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే 9959425483, 9440627532 నెంబరు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

Advertisement

Next Story