ఒంటరి మహిళతో అక్రమ సంబంధం... ఆపై హత్య..

by Sumithra |
ఒంటరి మహిళతో అక్రమ సంబంధం... ఆపై హత్య..
X

దిశ, పరిగి : ఒంటరి మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ.. మద్యం మత్తులో గొంతునులిమి హత్య చేశాడు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ కాన్పేట్ గ్రామానికి ఓ మహిళకు పది సంవత్సరాల క్రితం దాదాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. భర్త, కొడుకు మరణించడంతో తిరిగి తన సొంత గ్రామం రూప్ ఖాన్ పేట్ కు తిరిగి వచ్చి ఉంటుంది. అక్కడే తలకొండపల్లి మండలానికి చెందిన చంద్రమౌళి అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని అతనితో ఎనిమిది సంవత్సరాలుగా సహజీవనం చేస్తుంది.

ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి వారిద్దరూ మద్యం సేవించి గొడవ పడ్డారు. చిన్నగా మొదలైన గొడవ పెరగడంతో మద్యం మత్తులో ఉన్న చంద్రమౌళి తాడుతో గొంతు నులిమి మహిళలను హత్య చేశాడు. అనంతరం మృతురాలి బందువులకు, మృతురాలి తమ్ముడికి పోన్ చేసి శ్యామలమ్మ పడుకుని ఉన్న చోటే చనిపోయిందని సమాచారం ఇచ్చి పారిపోయాడు. మృతురాలి తమ్ముడు ఇంటికి వచ్చి చూసేసరికి చనిపోయి ఉంది. పరారైన చంద్రమౌళిని పట్టుకొచ్చి పోలీసులకు అప్పగించారు. శుక్రవారం రాత్రి ఇద్దరు తాగి గొడవపడ్డారని, తాగిన మైకంలో ఏం చేశానో తెలియదని పోలీసులకు తెలిపినట్లు సమాచారం.

Advertisement

Next Story