కారును ఢీకొట్టిన అంబులెన్స్..

by Kalyani |
కారును ఢీకొట్టిన అంబులెన్స్..
X

దిశ, గద్వాల: ముందు వెళ్తున్న కారును అంబులెన్స్ వెనుక నుంచి ఢీకొట్టిన సంఘటన ఆదివారం సాయంత్రం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఏపీ 09 సిఏ 1299 గల కారు గద్వాల పాత కలెక్టర్ కార్యాలయం ఎదుట వెళుతుండగా వెనక నుంచి ఏపీ 22 వి7304 నెంబర్ గల అంబులెన్స్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగంలో ధ్వంసం కాగా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కారును ఢీకొన్న వెంటనే అంబులెన్స్ పాత కలెక్టర్ కార్యాలయం గేటును ఢీకొట్టడంతో గేటు దిమ్మె కూలిపోయింది. అంబులెన్స్ లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

అంబులెన్స్ కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని అంబులెన్స్ డ్రైవర్ చెబుతుండగా అతివేగంతో రావడమే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపించారు. అంబులెన్స్ ఎక్కడికైనా వెళ్లే ముందు బండి కండిషన్ ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉండగా ఇవేవీ పట్టనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు చొరవ తీసుకొని వాహనాల కండిషన్ ను పరిశీలించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Next Story