మద్యం మత్తు ప్రాణం తీసింది..

by Sridhar Babu |
మద్యం మత్తు ప్రాణం తీసింది..
X

దిశ, ముత్తారం : మండలంలోని లక్కారం గ్రామానికి చెందిన ముదురుకోళ్ల సమ్మయ్య(45) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం చెరువులో మునిగిపోగా స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దాంతో ముత్తారం ఎస్సై గోపతి నరేష్ ఆధ్వర్యంలో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం సమ్మయ్య చెరువులో శవమై తేలాడు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం హోలీ పండుగ సందర్భంగా మద్యం తాగిన మైకంలో లక్కారంలోని చెరువులో స్నానం చేయడానికి వెళ్లి నీటిలో మునిగిపోయాడు.

పోలీసుల సహాయంలో చెరువులో వెతికినా మృతిని ఆచూకీ అభించలేదు. శనివారం ఉదయం చెరువు దగ్గరికి వెళ్లి చూడగా సమ్మయ్య శవమై తేలాడు. తన కొడుకు మద్యం తాగిన మైకంలోనే చెరువులోకి స్థానానికి వెళ్లి చనిపోయాడని తండ్రి ముదురుకోళ్ల కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి కొడుకు, కూతురు ఉన్నారు.

Next Story

Most Viewed