- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమాదవశాత్తు ఇళ్లు దగ్ధం
దిశ, బీర్పూర్ : ప్రమాదవశాత్తు ఇళ్లు దగ్ధమైన ఘటన మండల కేంద్రంలోని నాయకపు ఆసునూరిగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఏదుల కలవ్వకు చెందిన పూరి గుడిసె ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న నగదు, నగలు ఇంటి సామాగ్రితో పాటు నిల్వ ఉంచిన 30 క్వింటాళ్ల పత్తి పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రూ.10లక్షల ఆస్తి నష్టం జరిగిందని సమాచారం.
ఎంపీపీ రమేష్, సర్పంచ్ శిల్ప రమేష్, పోలీస్ సిబ్బంది వెంకటేష్, ముత్తయ్య, పంచాయతీ కార్యదర్శి సతీష్, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా బీర్పూర్ ఎంపీపీ మసార్తి రమేష్ రూ.3 వేలు, కోల్వయి పీఏసీఎస్ చైర్మన్ నవీన్ రావు 25 కిలోల బియ్యం, యువ చైతన్య యూత్ సభ్యులు రూ.5 వేలు, గ్రామస్థులు కలిసి తమకు తోచిన సాయం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్థులంతా అధికారులను వేడుకుంటున్నారు.